నలువైపులా అన్నప్పుడు నాలుగు దిక్కులుగా, దిక్పాలకులు అన్నప్పుడు ఎనిమిది దిక్కులుగా, వ్యాపింపచేయుటలో దశ దిశలుగా కనిపించే ఈ ప్రకృతి - వాస్తు శాస్త్ర ప్రకారంగా మాత్రం పదహారు దిక్కులుగా విభజించబడి మానవ నిర్మితమైన కట్టడాలకు సూత్రప్రాయమై విలసిల్లుతున్న మహాద్భుత శాస్త్రమే వాస్తు శాస్త్రము.
ప్రకృతి మానవుని జీవన విధానానికి అనుకూలంగా ఉండేటందుకు తగిన వసతులతో నివాసాన్ని ఏర్పరచుకొనేందుకు కల్పించిన అవకాశమే వాస్తు. పంచభూతాలతో నేస్తం చేస్తూ మనశ్శాంతిని ప్రసాదించే నిర్మాణమును ఏర్పరచుకునే విధానాన్నే వాస్తు అన్నారు మన విశ్వ దార్శనికులు.
ఉదాహరణకు ప్రకృతిలోని పంచభూతాలలో ప్రప్రధమమైనది శూన్యం. శూన్యమనగానే మనకు గుర్తుకొచ్చేది ఆకాశం. నిరాధారమైన శూన్యంలో వుండలేక భూమిని దన్నుగా చేసుకుని ఆకాశం నుండి వెలువడే హానికరమయిన కొన్ని సూర్య/చంద్ర కిరణాలను (radiation), మెరుపులు, పిడుగులు మఱియు వర్షముల బారి నుండీ తప్పించుకొని ఉండుటకు పై కప్పుని ఏర్పరచుకున్నాడు మానవుడు.
పంచభూతాలలో రెండవది వాయువు. నైఋతి దిక్కు నుంచీ వీచి వచ్చే గాలి ఉధృతిని తట్టుకొనలేక ఆ భాగాన్ని ఎత్తు చేసుకుని దక్షిణ దిక్కు ఎత్తుగా వుండాలనే విధానాన్ని అవలంబించాడు మానవుడు. |
పంచ భూతాలలో మూడవది అగ్ని. అగ్ని యొక్క దాహక శక్తి మనల్ని దహించివేస్తుంది కనుక భూమి పొరల్లో ఉండే అగ్ని సెగల్ని, నలు దిక్కుల నుంచీ వచ్చే వేడి వాతావరణాన్ని, ఆకాశం నుంచి వచ్చే సూర్య రశ్మిని తట్టుకొనుటకు తనకు తానుగా ఒక చల్లని వాతావరణాన్ని నిర్మించుకునే విధానాన్ని కనుగొన్నాడు మానవుడు.
అదే విధముగా పంచ భూతాలలో నాల్గవది, మానవ మనుగడకు ఆవశ్యకమయినది నీరు. నదులలోని మంచి నీరంతా దక్షిణ దిక్కుగా ప్రవహించుటవలన ఉప్పు నీటి పాలగుచున్నదని గమనించిన మానవుడు ఆ నీటిని వ్యతిరేక దిశగా ప్రవహింపచేసి ఈశాన్యంలో నిలువ చేసుకుని తన మనుగడను కొనసాగిస్తున్నాడు.
పంచభూతాలలో అయిదవది, మానవ జీవనానికి ఆవాస యోగ్యమయినది మట్టి. కృంగి కృశించిపోయే లక్షణమున్న మట్టిని తెలివిగా చదును చేసి పీటభూమిగా మార్చుకుని, నివాసయోగ్యమయ్యే విధముగా ఆవాసాన్ని ఏర్పరచుకున్నాడు మానవుడు.
ఈ విధంగా పంచభూతాలు మానవుని మనుగడకు ఏ రీతిలో వాడుకుంటే ఎలా ఉపయోగపడతాయో చెప్పేదే వాస్తు శాస్త్రం. ఈ వాస్తు విధానాన్ని అనుసరించుటలో మన పూర్వీకులు సత్ఫలితాలను పొందారు కనుకనే నేటికీ మనం అవే విధానాలను అనుసరిస్తూ ముందు తరాలకు కూడా చేరవేసే వారధులమయ్యాము.

|
మా ఈ విశ్వకర్మ వాస్తు నిలయాన్ని వేదికగా చేసుకుని మానవాళికి సౌఖ్యవంతమైన, సుఖప్రదమైన జీవన విధానాలను సాగించుటకు నిర్మాణాలను రూపొందించడానికి మా వంతు విధిగా వాస్తు సలహాలు, తగు సూచనలు చేయటం జరుగుతోంది. గతమందే నిర్మించిన నిర్మాణాలలో వాస్తు దోషమున్నచో వాటిని సరిచేయుటకు స్వల్ప రుసుముతో, అనువైన విధానాలతో, అనుకూల వాస్తు ఫలితాలనెన్నో ఇప్పటికే అందించియున్నాము. |
గమనిక: మమ్మల్ని సంప్రదించినందుకు ధన్యవాదాలు.మా నుండీ మెయిల్ కోసం కాస్త వేచి ఉండండి. సంప్రదించిన వారి వరుస క్రమంలో మేము ప్రతిస్పందిస్తాము.